ప్రతి మంగళవారం 'హనుమాన్ చాలీసా' పఠిస్తే?
మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటార
Publish Date: Tue, 14 Aug 2018 (11:28 IST)
Updated Date: Tue, 14 Aug 2018 (13:54 IST)
మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటారు. ఏదైనా ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే ఆందోళనకు గురవకుండా సంతోషంగా ఉంటారు.
విజయాన్ని సాధించిన అనుభూతులు ఇక ఎందులోను ఉండవు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని దైవాన్ని ప్రార్థిస్తుంటాం. అందుకు నిదర్శనం హనుమంతుడు. హనుమంతుని ఆరాధించిడం వలన కార్యసిద్ధి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.
ప్రతి మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి ఆలయాలలో గాని, పూజా మందిరంలో గాని కూర్చుని హనుమాన్ చాలీసా అని 11 సార్లు పారాయణ చేయడం వలన ఆ స్వామి అనుగ్రహం దక్కుతుందని గ్రంధాలలో చెబుతున్నారు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఇలాంటి పూజలు చేయడం వలన తప్పకుండా హనుమంతుని అనుగ్రహం లభించడమే కాకుండా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More