Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మంత్రాన్ని పఠించాలి?

Advertiesment
Tuesday Puja
Tuesday Puja
మంగళవారం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజుగా భావిస్తారు. కష్టాలు, బాధలు తొలగిపోవడానికి చేసే పూజలు, పరిహారాలను చేయడానికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు. ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు చేయవలసిన ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం. 
 
మంగళవారం ఉదయం చెప్పవలసిన మంత్రం :
ఓం శరవణభవాయ నమః 
ఓం శరవణభవ నమః ఈ మంత్రాలను ఉదయం వేళ మనసారా జపిస్తే మనసులోని కష్టాలు, దుఃఖాలు, ఆటంకాలు తొలగిపోయి, విజయం కలుగుతుంది.
 
మనసులోని కష్టాలను పోగొట్టే మంత్రం:
ఓం అంగారకాయ నమః మంగళవారం రోజున ఈ మంత్రాలను జపించడం వల్ల భయం, మనసులోని గందరగోళాలు తొలగిపోయి, ధైర్యం, సానుకూల శక్తి కలగడానికి సహాయపడుతుంది.
 
చేయవలసిన పూజ : మంగళవారం సాయంత్రం వేళ ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి, పసుపు కలిపిన నీటిని తులసి కోట దగ్గర చల్లాలి. తరువాత, ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి పూజించాలి. ఇది ఇంట్లో సిరిసంపదలు, ఐక్యత కలిగేలా చేస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి సహాయపడుతుంది.
 
దీపం వెలిగించవలసిన సమయం, విధానం :
మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 6:30 గంటల వరకు (ప్రదోష కాలం) దీపం వెలిగించడం ఉత్తమం. రెండు ప్రమిదలలో నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి దీపం వెలిగించవచ్చు. ఇది కుజ దోషం, అప్పుల సమస్య, కోర్టు కేసులు, ఆటంకాలు వంటివి తొలగిపోవడానికి ఇది సహాయపడుతుంది.
 
పూజలో ఉపయోగించవలసిన వస్తువులు : 
మంగళవారం రోజున పూజ గదిలో తమలపాకు, మందార పువ్వు, నిమ్మకాయ వీటిని తప్పనిసరిగా ఉంచి పూజించాలి. ఈ వస్తువులను పూజ గదిలో ఉంచి పూజిస్తే, గ్రహ దోషాలు తొలగి, కుమార స్వామి అనుగ్రహం లభించి, ఆటంకాలు తొలగిపోతాయి.
 
దానం చేయవలసినవి : 
మంగళవారం రోజున అన్నదానం చేయడం చాలా మంచిది. దీనితో పాటు నీరు, ఎరుపు రంగు వస్త్రాలు, కందిపప్పు వంటివి కూడా దానంగా ఇవ్వవచ్చు. వీటిలో ఏదైనా ఒకటి దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. అంతేకాకుండా కుజ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ వస్తువులను పేదలకు లేదా గుడికి కూడా దానంగా ఇవ్వవచ్చు.
 
మంగళవారం చేయదగిన పరిహారాలు :
నువ్వుల నూనె దీపం వెలిగించడం, ఓం శరవణభవ మంత్రాన్ని 108 సార్లు చెప్పడం, దుర్గా దేవికి రాహు కాలంలో దీపం వెలిగించడం, భైరవుడికి రాహు కాలంలో పూజ చేయడం. హనుమంతుడి పూజ, రామ నామాన్ని జపించడం. 
 
మంగళవారం రాత్రి చెప్పవలసిన మంత్రం :
ఓం శరవణభవ - ఈ మంత్రాన్ని 54 సార్లు చెప్పాలి. ఇలా జపిస్తే మనశ్శాంతి, మంచి నిద్ర, ప్రతికూల ఆలోచనలు తొలగిపోవడం, జీవితంలో పురోగతి కలగడం వంటి ఫలితాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-09-2025 సోమవారం ఫలితాలు - అనవసర జోక్యం తగదు.. ఆపన్నులకు సాయం అందిస్తారు...