Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరి మధ్య మూడో వ్యక్తిగా స్మార్ట్ ఫోన్.. అనుంధాలకు తూట్లు!

Advertiesment
Smartphones
ఇపుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్లే ఇపుడు బంధాలకు తూట్లు పొడుస్తున్నాయి. ముఖ్యంగా, భార్యా భర్తలు లేదా ప్రేమికుల మధ్య ఇపుడు మూడో వ్యక్తిగా స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. ఇది తెలియకుండానే ఎన్నో అవాంతరాలను తెచ్చిపెడుతోంది. 
 
చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. అందులో డేటా ఉంటే చాలు.. తమకు నచ్చిన, నచ్చని అంశాలను క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఫలితం ఎలా ఉండబోతుందనేది ఆలోచించకుండానే పోస్టు పెట్టేస్తున్నారు. 
 
ఈ ఒక్క పోస్టుతోనే బంధాలకు తూట్లు పొడుస్తోంది. కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. ఆత్మీయుల మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. బంధుత్వాలను దూరం చేస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్తున్నాయి. కాపురాలను కూల్చివేస్తున్నాయి. 
 
అనేక ప్రాంతాల్లో ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వధూవరులు పెళ్లిపీటలు ఎక్కక ముందుగానే ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగేందుకు కారణమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం.. సామాజిక మాధ్యమాలు అధికంగా ఉపయోగించే మహానగరంలో ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇద్దరి మధ్య మూడో వ్యక్తి చొరవ వల్లనో... కుటుంబ సభ్యుల ఆధిపత్యం వల్లనో గతంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి. కానీ నేటి రోజుల్లో ఇద్దరి మధ్య మూడో వ్యక్తిగా చేరిన స్మార్ట్​ ఫోన్​.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాక్సిన్లపై అపోహలు తొలగించిన డా. రవి ఆలపాటి - లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా