టైమ్ చూస్తూ శృంగారం చేస్తాడు... చీవాట్లు పెట్టినా మానడంలేదెలా?
మా వారు ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉంటారు. కనీసం నాతో కొద్దిసేపు మాట్లాడాలన్నా ఏదో చేస్తూనే మాట్లాడుతుంటారు. అవన్నీ సర్దుకుపోతాను. కానీ రాత్రిపూట బెడ్ పైకి వచ్చేసరికి ఆయన చేష్టలు నాకు చికాకు కలిగిస్తున్నాయి. శృంగారం చేస్తున్నంతసేపూ గోడకు తగిలించిన గడియారం
Publish Date: Wed, 13 Sep 2017 (20:54 IST)
Updated Date: Wed, 13 Sep 2017 (20:57 IST)
మా వారు ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉంటారు. కనీసం నాతో కొద్దిసేపు మాట్లాడాలన్నా ఏదో చేస్తూనే మాట్లాడుతుంటారు. అవన్నీ సర్దుకుపోతాను. కానీ రాత్రిపూట బెడ్ పైకి వచ్చేసరికి ఆయన చేష్టలు నాకు చికాకు కలిగిస్తున్నాయి. శృంగారం చేస్తున్నంతసేపూ గోడకు తగిలించిన గడియారం వైపు చూస్తూ చేస్తుంటారు.
అలా చేస్తున్నారని గడియారాన్ని తీసేస్తే ఈమధ్య సెల్ ఫోను పక్కన పెట్టుకుని అందులో టైమ్ చూస్తున్నారు. అదేమని అడిగితే రేపు ఉదయం త్వరగా వెళ్లాలి అని సమాధానమిస్తున్నారు. నాకంటే అదేమీ ముఖ్యం కాదని అంటే... డబ్బు లేకపోతే ఎలా బతుకుతారు. సరే మానేసి ఇంట్లో కూచునేదా అని మండిపడతారు. ఈయనతో ఎలా చేయాలో అర్థం కావడంలేదు.
మీ వారు చేసేది తప్పే. ఉద్యోగం ఎంత ముఖ్యమో భార్యా పిల్లలకు టైమ్ కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మరీ రాత్రిపూట శృంగారం చేసేటపుడు కూడా సమయాన్ని చూసుకుంటూ హడావుడిగా చేయడం చికాకునే తెప్పిస్తుంది. ఆయనకు ఎలాగో మెల్లగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. మీకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలియజేయండి. అప్పటికీ తన పద్ధతి మార్చుకోనట్లయితే మానసిక నిపుణులను సంప్రదిస్తే తగు పరిష్కారం చెప్తారు.
ivr
Publish Date: Wed, 13 Sep 2017 (20:54 IST)
Updated Date: Wed, 13 Sep 2017 (20:57 IST)