Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

Advertiesment
garuda seva in tirumala

సెల్వి

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేస్తోంది. తదుపరి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున భక్తుల రద్దీని అంచనా వేసి, యాత్రికుల భద్రత కోసం టిటిడి రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. 
 
ఈ సంవత్సరం, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8న అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది.

ఈ నేపథ్యంలో గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ 7న రాత్రి 9 నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-09-2024 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు...