Publish Date: Fri, 07 Aug 2026 (12:15 IST)
Updated Date: Fri, 07 Aug 2026 (12:16 IST)
నీ యొక్క విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే సాధారణమైన విషయాలకన్నా అద్భుతాలు సృష్టించడానికి కొద్ది సమయం పడుతుంది.
అనుమానం వున్న వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించవద్దు. విశ్వసించిన వ్యక్తిని ఎప్పుడూ అనుమానించవద్దు.
ఎక్కువ భావోద్రేకాలతో జీవితం గడపడం కష్టం, అలాగే ఖచ్చితంగా మాట్లాడి బంధుత్వాలు నిలబెట్టుకోవడం చాలా కష్టం.
సలసలా కాగే నీటిలో ఎలాగైతే ప్రతిబింబాన్ని చూడలేమో అలాగే కోపంలో వున్నప్పుడు నిజాన్ని చూడలేము.
అహం మనల్ని అణచివేస్తుంది. అణుకువ మనల్ని ఆలోచింపజేస్తుంది.
విజయానికి 3 సూత్రాలు, అందరికన్నా ఎక్కువ తెలుసుకో. అందరికన్నా ఎక్కువ పనిచేయి. అందరికన్నా తక్కువ ఆశించు.
లంగరుకి కట్టివేసిన పడవ ఎలా కదల లేదో అలాగే, అహంకారానికి లోనైనవాడు ఎదగలేడు.
ప్రజలు డబ్బు సంపాదనలో తమ ఆరోగ్యాన్ని కోల్పోతారు. అదే డబ్బుని తిరిగి ఆరోగ్యాన్ని పొందడానికి ఖర్చు చేస్తారు.
ప్రతిరోజూ ఈ ప్రపంచంలోని ధనవంతుల జాబితాను చూడు. అందులో నీ పేరు లేకపోతే పనిచేయడం ఆపవద్దు.