మంగళవారం రోజున స్త్రీలు ఆచరించాల్సిన పూజ ఏమిటంటే?
మంగళవారం కుమారస్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని పటాలన
Publish Date: Mon, 01 Oct 2018 (14:45 IST)
Updated Date: Mon, 01 Oct 2018 (15:09 IST)
మంగళవారం కుమారస్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని పటాలను పసుపు, కుంకుమలతో బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి.
ఆ తరువాత దీపారాధన చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ నాడు పూజలు చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది. అలాగే ఆలయాలకు వెళ్ళి కుమారస్వామివారిని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన బాధలు, దారిద్య్రాలు తొలగిపోయి సిరిసంపదలు చేకూరుతాయి.
ఈ రోజున ఎరుపు రంగు దుస్తులకు ధరించి ఆలయాలకు వెళితే మంచిది. అలానే స్త్రీలు ఎరుపురంగు పువ్వులు, గులాబీ పువ్వులు పెట్టుకుంటే దీర్ఘసుమంగళీగా ఉంటారని పురాణాలలో చెప్పబడింది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More