Publish Date: Tue, 10 Nov 2026 (13:07 IST)
Updated Date: Tue, 10 Nov 2026 (13:12 IST)
Kanda Sashti Viratham 2026
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వ్రతాలలో స్కంధ షష్ఠి వ్రతం, కార్తీక వ్రతం, మంగళవార వ్రతం అనే మూడూ ప్రధానమైనవి. ఇందులో స్కంధ షష్ఠి వ్రతం వరుసగా ఆరు సంవత్సరాలు, కార్తీక వ్రతం పన్నెండు సంవత్సరాలు, మంగళవార వ్రతం మూడు సంవత్సరాలు ఆచరించబడుతుంది. రాక్షుల శక్తుల రూపమైన అహం, మాయను తొలగించుకునేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మనిషికి ఆరు రకాల శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు రకాలను నశింపజేసి సర్వజ్ఞత్వం, అపరిమిత శక్తి, స్వతంత్రత, అనంతత్వం, సహజ జ్ఞానం, కరుణ అనే దైవ గుణాలు కైవసం అవుతాయి. ఇవి స్కంధ షష్ఠి వ్రతంతో సాధ్యమవుతాయి.
ఈ వ్రతాన్ని అందరూ పాటిస్తారు. విద్యార్థుల కోసం, వివాహితులు సంతానం కోసం, అవివాహితులు వివాహం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని మరికొందరు వారి వారి కోరికలు నశింప జేయాలని సంకల్పించుకుని వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు వారి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ఆరో రోజులు ఒక్క పూట ఆహారం వీడి లేదంటే మిరియాలు, నీరు, పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం వుంటారు. ఆరో రోజు సూర పద్ముని సంహారం, తిరు కళ్యాణం తర్వాత ఉపవాసం వీడుతారు.
ఈ వ్రత సమయంలో, ప్రతిరోజూ స్కంధ షష్ఠి కవచం, స్కంధ పురాణం వంటివి పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. షష్ఠి వ్రతంలోని ఆరు రోజులు కందస్వామి ఆలయంలో జరిగే పూర్ణకుంభ విశేష అభిషేకం, షణ్ముఖార్చన, కంద పురాణ పారాయణం జరుగుతాయి.
వ్రతం ముగిసే రోజున మురుగన్ ఆలయంలో సూరసంహారం జరుగుతుంది. మరుసటి రోజు వ్రతం ఆచరించిన వారందరూ వ్రతాన్ని ముగిస్తారు. పారణ రోజున ఆరుగురికి అన్నదానం చేసి భోజనం చేయాలి. ఇలా వ్రతాన్ని పాటించడం వల్ల కుమార స్వామి అనుగ్రహంతో కోరిన వరాలన్నీ లభిస్తాయని, అన్ని శుభాలు జరుగుతాయని విశ్వాసం.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More