Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తిక శుద్ధ ఏకాదశి రోజున పూజ.. అన్నదానంతో కోటి ఫలం

Advertiesment
karthika Masa

సెల్వి

, సోమవారం, 11 నవంబరు 2024 (19:55 IST)
కార్తిక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, 'బృందావన ఏకాదశి' అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. 
 
తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహ భారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణువును తులసి మాలలతో పూజించి, రాత్రంతా పురాణం కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. 
 
మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ రోజున అన్నదానం చేస్తే.. పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితంతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. 
 
ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా అపమృత్యు దోషాలను నివారిస్తుంది. కార్తిక ఏకాదశి వ్రతంతో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. శివునికి అభిషేకం ఆరాధనలు చేసి.. ఆవునేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపములు, తులసీ కోట వద్ద ఒక దీపం వెలిగించాలి. 
 
ఆపై పూజా మందిరంలో ధూపం వేసి.. చేతనైన నైవేద్యం సమర్పించుకోవాలి. ముఖ్యంగా శివకేశవులకు సంబంధించిన స్తోత్రాలు చదవాలి. విష్ణుసహస్రనామం, శివ సహస్రనామాలు పఠించాలి. ఇలా చేస్తే సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. పాపాలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మాసం రెండో సోమవారం.. తిలాదానం చేస్తే.. దీపం వెలిగిస్తే?