Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్కోటి ఏకాదశి : ఏకాదశి వ్రతంతో పుణ్యఫలం.. విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా...?

Advertiesment
Ekadasi

సెల్వి

, శుక్రవారం, 10 జనవరి 2025 (09:30 IST)
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికే అంతా ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకోవాలి. ఉత్తర ద్వార దర్శనంతో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.  
Ekadasi
Ekadasi
 
ముక్కోటి ఏకాదశి వ్రతం నియమ నిష్ఠలతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు చేపట్టిన ఉపవాస దీక్ష.. ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచిగా పూజా కార్యక్రమం ముగించుకొవాలి. ఈ రోజు ఉపవాసం చేసి.. హరి నామ స్మరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్య ఫలం లభిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజు.. విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా... ఎన్నో జన్మల పుణ్యం సంప్రాప్తిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. 
Ekadasi
Ekadasi
 
సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహా విష్ణువు మూడు కోట్ల దేవతలకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అందువల్ల మనం కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ముక్కోటి రోజు భక్తులంతా తప్పకుండా ఉపవాసం ఉంటారు. శక్తి కొలదీ భజనలు, భక్తి పాటలు, విష్ణు సహస్ర నామ పారాయణలు ఇలా అనేక స్తోత్రాలు పఠిస్తారు. 
Ekadasi
Ekadasi
 
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజును విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

Ekadasi
Ekadasi

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-01-2025 శుక్రవారం దినఫలితాలు : అవకాశాలను చేజిక్కించుకుంటారు...