Daily Horoscope

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలలో గుడ్లగూబను చూస్తే ఏంటి ఫలితం?

Advertiesment
Owl
Owl
కలలో గుడ్లగూబను చూస్తే మీ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అర్థం. అదే విధంగా, మీలో జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేయడానికి వెళ్ళేటప్పుడు గుడ్లగూబను చూస్తే, అప్పుడు ఇతరుల వద్ద చిక్కుకున్న అప్పు డబ్బును వసూలు చేసుకుంటారు. అలాగే కార్యసిద్ధి లభిస్తుంది. 
 
జీవితంలో పురోగతి కోసం ఒక కొత్త మార్గం లభిస్తుంది. త్వరలోనే సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. ఇంకా రాత్రి సమయంలో గుడ్లగూబను చూస్తే అది కూడా అనేక విధాలుగా మేలు కలిగిస్తుందని భావిస్తారు. అన్ని సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. 
 
వృత్తిలో పురోగతి కలుగుతుంది. రాత్రి సమయంలో గుడ్లగూబ అరుపు వినిపిస్తే మేలు, విజయం పొందుతారు. కొత్త స్నేహితులను ఏర్పరచుకుంటారు. పగటిపూట గుడ్లగూబను చూస్తే అది అదృష్టాన్ని తెస్తుందని భావిస్తారు. అంతేకాకుండా, జీవితంలో సానుకూల మార్పులు జరగబోతున్నాయి. త్వరలోనే శుభవార్త వస్తుంది. 
 
గుడ్లగూబను తరచుగా చూడటం వల్ల మీ జీవితంలో అకస్మాత్తుగా సంతోషం వస్తుంది. అనేక మార్గాల నుండి డబ్బు వచ్చి చేరుతుంది. మరోవైపు మీరు పనికి వెళ్లే ప్రదేశాలలో గుడ్లగూబను చూస్తే అది కూడా శుభప్రదంగానే పరిగణించబడుతుంది. మీరు చేపట్టిన పని విజయవంతంగా పూర్తవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..