Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

Advertiesment
mahanandi temple

సెల్వి

, గురువారం, 14 నవంబరు 2024 (13:04 IST)
mahanandi temple
ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది కోనేరులో నీటి స్వచ్ఛత మరోసారి రుజువైంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. 
 
ఆలయం లోపల గల రుద్రగుండం కోనేరులోని నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబాలు ఎంతో స్పష్టంగా కనపడ్డాయి. ఈ క్షేత్రంలో ఎండాకాలం అయిన వాన కాలం సీజన్‌ ఏదైనా సరే.. నీటి ప్రవాహం ఒకే విధంగా వుండటం ఇక్కడ విశేషం. ఈ క్షేత్రం నీటి ప్రవాహంపై స్కందపురణంలో సైతం రాయబడింది.
 
మహానంది క్షేత్రంలో కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని రాత్రి ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరు వద్ద వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?