Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూ - వారణాసిలో శ్రీవారి ఆలయాలు

Advertiesment
TTD
జమ్మూ, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ, జమ్మూ ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. 
 
ఈ ఏడాదిలోనే జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. ఈ ఆలయం కూడా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే నెలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్