Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

Advertiesment
Gold Man

సెల్వి

, శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (12:40 IST)
Gold Man
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒంటిపై ఏకంగా ఆరు కిలోల బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్‌. ఆయన్ను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇంకా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ ఎక్కువగా వుండటంతో జాగ్రత్తగా వుండాలని పోలీసులు సూచించారు. 
 
హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేశారు. మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, ఉంగరాలతో సహా ఒంటిపై దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ధరించి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. 
 
బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమలలో విపరీతమైన జనం ఉన్నారని, ఇంత భారీ మొత్తంలో బంగారం ధరించి తిరగడం సురక్షితం కాదని విజయ్ కుమార్‌కు సూచించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?