Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక ఆరోపణలు... ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ సూసైడ్

Advertiesment
Ex-Olympics Gymnastics Coach
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (14:13 IST)
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్‌ గెడ్డార్ట్‌ బలన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు ఉండే వ్యక్తితో పాటు.. మరో మహిళ ఆరోపణలు చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌గా పని చేసిన గెడ్డార్ట్‌ మిచిగన్‌లో‌ మహిళా జిమ్నాస్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్‌ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. 
 
ఇక్కడ అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్‌ శిక్షణ కోసం వచ్చేవారు. అయితే గెడ్డార్ట్‌, అక్కడి మహిళా జిమ్నాస్ట్‌లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్‌ అనే వ్యక్తి ఆరోపణలు గుప్పించారు.
 
నాసల్‌ చేసిన ఆరోపణల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్‌ అటార్నీజనరల్‌ డెనా నిసెల్‌ తెలిపారు. 
 
గెడ్డార్ట్‌తో పాటు నాసర్‌లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్‌ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్‌ గెడ్డార్ట్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా గెడ్డార్ట్‌ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్‌ రాచెల్‌ డెస్‌హోలాండర్‌ 2000 సంవత్సరంలోనే సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిచ్‌పై దెయ్యాలేమీ లేవు.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు