Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైనా నెహ్వాల్ పుట్టిన రోజు- నచ్చిన హీరో మహేష్ బాబు.. మోదీ కూడా..?

Advertiesment
Saina Nehwal
, బుధవారం, 17 మార్చి 2021 (12:18 IST)
హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పుట్టిన రోజు నేడు. మార్చి 17, 1990లో ఆమె పుట్టారు. సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తల్లిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లు సాధించినవారే. 
 
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ క్రీడాకారిణి సైనా నెహ్వాలే. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా పేరిట రికార్డు వుంది. 
Saina Nehwal
Saina nehwal_Kashyap
 
2007లో ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ను, 2009లో ఇండోనేషియా ఓపెన్, బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 
 
2010లో ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది. అలాగే 2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సంపాదించుకుంది. 
Saina Nehwal
Saina-Kashyap
 
సైనా నెహ్వాల్ బయో డేటా
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పొలిటీషియన్ 
బీజేపీ పార్టీ తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
జన్మస్థలం:  హిస్సార్, హర్యానా
రాశి- మీనం 
పాఠశాల చదువు - హిస్సార్ క్యాంపస్ స్కూల్, 
భారతీయ విద్యా భవన్ పబ్లిక్స్ స్కూల్ హైదరాబాద్, 
నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్కూల్- హైదరాబాద్. 
సెయింట్ ఆన్స్ కాలేజ్ హైదరాబాద్.
 
హాబీస్ - ట్రావెల్ చేయడం 
భర్త పేరు - పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్ క్రీడాకారుడు)
 
వివాహ తేది - 14 డిసెంబర్ 2018  
తల్లిదండ్రులు - హర్వీర్ సింగ్ నెహ్వాల్ (సైంటిస్ట్), తల్లి పేరు.. ఉషా నెహ్వాల్ 
సోదరి పేరు- అబు 
నచ్చిన వంటకం - అలూ పరోటా, కివి
 
నచ్చిన నటులు - షారూఖ్ ఖాన్, మహేశ్ బాబు 
అథ్లెట్స్ - క్రికెటర్ - సచిన్, టెన్నిస్ ప్లేయర్- రోజర్ ఫెదరర్ 
నచ్చిన రాజకీయ వేత్త - నరేంద్ర మోదీ.

Saina Nehwal
saina nehwal

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ కీలక నిర్ణయం.. ప్రేక్షక్షులు లేకుండా మ్యాచ్‌లు.. ఆ టోర్నీలు రద్దు?