Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

Advertiesment
Krishna Jayanti 2026
Krishna Jayanti 2026
భారతదేశం మొత్తం చాలా కోలాహలంగా జరుపుకునే పండుగలలో ఒకటి కృష్ణ జయంతి. భగవాన్ కృష్ణుని అనుగ్రహం తమకు లభించాలని భక్తులు, తమ ఇంట్లో కృష్ణుని పాదాలను వేసి, తన ఇంటికి ఆహ్వానించి పూజిస్తారు. తమ పిల్లలకు కృష్ణుడు, రాధ వేషాలు వేసి, తమ్మ భక్తిని వ్యక్తపరచడం ఆనవాయితీ.  
 
మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన దినాన్ని ఘనంగా జరుపుకునే రోజే కృష్ణ జయంతి. దీనిని గోకులాష్టమి, కృష్ణ జన్మాష్టమి, జన్మాష్టమి అని అనేక పేర్లతో భక్తులు పిలుస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో పూజలు చేస్తారు. 
 
కృష్ణుడు జన్మించాడని చెప్పబడే మథురా నగరంలో, కృష్ణుడు పెరిగిన బృందావనంలో చాలా బ్రహ్మాండంగా వేడుకలు జరుగుతాయి. దేవాలయాలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు, మథురలోని చెరసాలలో, శ్రావణ మాసపు కృష్ణ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రం కలిసిన రోజున అవతరించాడని చెప్పబడింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం రోజున కృష్ణ జయంతి జరుపుకోబడుతుంది. శ్రీకృష్ణుని బాల్య లీలలను స్మరిస్తూ ఘనంగా ఉట్టి కొట్టే ఉత్సవాలు నిర్వహిస్తారు
 
కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?
 
శ్రీ కృష్ణుడు భూమిపై అవతరించాడు అనేది కేవలం కల్పిత కథ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ కృష్ణుని జననం, జీవితానికి సంబంధించిన ఆధారాలు మథుర, బృందావనంలో ఇప్పటికీ ఉన్నాయని చెప్పబడుతోంది. భాగవతం, విష్ణు పురాణం, హరివంశం, మహాభారతం వంటి శాస్త్ర గ్రంథాలు కూడా కృష్ణుని జననానికి ఆధారాలను, ఆయన జీవిత విశేషాలను వివరిస్తున్నాయి. 
 
ఇకపోతే భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ