బాదం బర్ఫీ తయారీ విధానం.....
వాల్‌నట్స్‌లో బాదం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా బాదం చాలా ఇష్టంగా ఉంట
Publish Date: Fri, 29 Jun 2018 (13:20 IST)
Updated Date: Fri, 29 Jun 2018 (17:54 IST)
వాల్‌నట్స్‌లో బాదం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి సంబంధిత వ్యాధులకు చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా బాదం చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి బాదం పప్పుతో బర్ఫీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బాదంపప్పు - 1 కప్పు
చక్కెర - 1/4 కప్పు
నెయ్యి - 1/4 కప్పు
పాలు - 1/4 కప్పు
పిస్తా - గార్నిష్‌కి సరిపడా
తయారీ విధానం:
ముందుగా బాదంపప్పులను కొద్దిసేపు వేడినీళ్ళలో నానబెట్టిన తరువాత వాటి పొట్టును తీసివేయాలి. ఆ బాదం పప్పులను పాలతో కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఒక పాన్ తీసుకొని పంచదార, కొద్దిగా నీరు పోసి తీగ పాకం పట్టాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్‌ను పాకంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకి వస్తుండగా కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలుపుకోవాలి.
ఈలోగా ఒక స్టీల్ ప్లేట్‌ను తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా ఉడికి విడివిడిలాడుతుండగా దింపేయాలి. వెంటనే ప్లేట్ మీద కొద్దిగా మందంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. అది గట్టిపడుతుండగా మీకు కావలసిన షేప్‌లో దానిని కట్ చేయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. అంతే బాదం బర్ఫీ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More