గసగసాలతో పాయాసమా.. ఎలా చేయాలో చూద్దాం..
గసగసాలలో శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగిఉంటాయి. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యలను తొలగించుటలో గసగసాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇలాంటి గసగసాలతో
Publish Date: Wed, 25 Jul 2018 (14:04 IST)
Updated Date: Wed, 25 Jul 2018 (14:54 IST)
గసగసాలు శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యాన్ని కలిగిఉంటాయి. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యలను తొలగించుటలో గసగసాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇలాంటి గసగసాలతో పాయాసం ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
గసగసాలు - 3 స్పూన్స్
బియ్యం - 2 స్పూన్స్
బెల్లం - అరకప్పు
కొబ్బరితరుము - అరకప్పు
నీళ్లు - 1 కప్పు
యాలక్యాయలు - 2
తయారీవిధానం:
ముందుగా బాణలిలో గసగసాలు, బియ్యం వేగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి. మళ్లీ కొబ్బరి తురుము, యాలక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బెల్లం, కొద్దిగా నీరు వేసుకుని ఉడికించుకోవాలి. మిశ్రమం ఉడికేటప్పుడు మధ్యమధ్యలో గరిటెతో కలుపుకోవాలి. కాస్త చిక్కనైన తరువాత దించేయాలి. అంతే గసగసాలు పాయాసం రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
Read More