Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో నలుగురికి స్వైన్ ఫ్లూ.. జాగ్రత్తలు లేకుంటే..?

Advertiesment
swine flu

సెల్వి

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (20:09 IST)
మొన్న కరోనా.. నిన్న డెంగ్యూ.. ఇవాళ స్వైన్‌ ఫ్లూలు ప్రజలను హడలెత్తింపజేశాయి. ఇప్పటికే వైరల్‌ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వైరల్‌ ఫీవర్లు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. 
 
తాజాగా తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌.. నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. 
 
మాదాపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి.. టోలిచౌకిలో 69 ఏళ్ల వృద్ధుడికి.. నిజామాబాద్‌లో ఒకరికి, హైదర్‌నగర్‌లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయట పడింది. 
 
ఈ నలుగురి శాంపిల్స్‌ హైదరాబాద్‌ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్‌కు తరలించారు. ఆ శాంపిల్స్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించగా.. నలుగురికి స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్థారణ కావడంతో కలకలం రేపింది.
 
స్వైన్‌ ఫ్లూ నియంత్రణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు..
స్వైన్‌ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది
స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి
ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి
స్వైన్‌ ఫ్లూ సోకకుండా విధిగా మాస్కులు ధరించాలి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండప్రాంతాలలో పుట్టిన బుడమేరు చరిత్ర ఇదే...