Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళను భలే కాపాడిన ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్స్.. కానీ (video)

Advertiesment
RPF

సెల్వి

, సోమవారం, 14 అక్టోబరు 2024 (15:43 IST)
RPF
లింగంపల్లిలోని ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కుమార్, పి రాజశేఖర్, ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం నుంచి ఓ మహిళను కాపాడారు. 
 
ఆదివారం ఉదయం 9.28 గంటలకు రైలు నెం. 17647 (HYB-పూర్ణ ఎక్స్‌ప్రెస్) లింగంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వద్దకు రెండు నిమిషాలు ఆగింది. 
 
హాల్ట్ సమయంలో, ఒక మహిళా ప్రయాణికురాలు, కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు ఆమె కాలు తప్పి రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుంది. అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికురాలిని రక్షించారు. వారి సాహసోపేతమైన చర్య ఆ మహిళ ప్రాణాలను కాపాడింది. అయితే కానిస్టేబుల్ విశ్వజీత్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
 
ఇక ఇద్దరు ఆర్‌పిఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలకు అభినందనలు తెలుపుతూ, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, సికింద్రాబాద్, దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ నడుస్తున్న రైళ్లలో ఎక్కవద్దని లేదా దిగవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంట్రుకవాసిలో చావు తప్పడమంటే ఇదేనేమో... (Video Viral)