Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun's Team సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం : అల్లు అర్జున్ టీమ్

Advertiesment
woman deadbody

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (17:04 IST)
Allu Arjun's Team, Pushpa Filmmakers Respond Over Woman’s Death Incident At Sandhya Theater హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' చిత్రం రిలీజ్ సందర్భంగా జరిగిన విషాదకర ఘటనపై హీరో అల్లు అర్జున్ బృందం స్పందించింది. ఈ థియేటర్‌లో బుధవారం అర్థరాత్రి వేసిన ప్రీమియర్ షోను తిలకించేందుకు వచ్చిన రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ చిత్రాన్ని చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. వీరిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇందులో చిక్కకున్న రేవతి, ఆమె తొమ్మిదేళ్ల శ్రీతేజ్ అనే కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ రేవతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ విషాదకర ఘటనపై హీరో అల్లు అర్జున్ బృందం స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర ఘటనగా పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బుధవారం రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం' అని తెలిపింది.
 
మహిళ ప్రాణం తీసిన 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో 
 
Pushpa 2 stampede: Woman dead అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' చిత్రం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నగరంలోని సంద్య 70 ఎంఎం థియేటర్‌లో బుధవారం రాత్రి ఈ సినిమాకు సంబంధించి బెన్ఫిట్ షో వేశారు. దీన్ని చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్‌కు తరలి వచ్చారు. దీనికితోడు హీరో అల్లు అర్జున్ సైతం సినిమాను చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆమె తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7)తో కలిసి ఈ చిత్రం ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌కు వచ్చారు. అదేసమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజలు పస్మారక స్థితిలోకి వెళ్లారు. 
 
వెంటనే పోలీసులు విద్య నగర్‌లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్‌‌కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. దీంతో హీరో అల్లు అర్జున్‌తో సహా ఆ చిత్ర నిర్మాతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

No Confidence Vote ప్రధాని మిచెల్‌‍పై అవిశ్వాస తీర్మానం... ఫ్రాన్స్ కీలక పరిణామం