Allu Arjun 'పుష్ప' హీరో అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చిక్కపడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకానున్నారు. ఈ ఠాణా పోలీసులు ఇచ్చిన నోటీసులతో ఆయన తన న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు రానున్నారు. ఈ నెల 4వ తేదీ అర్థరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వద్ద పోలీసులు విచారించనున్నారు. "పుష్ప-2" చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దీనికి సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో డిసెంబరు 13వ తేదీన ఆయన అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ తర్వాత రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు మరోమారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వద్ద మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.