Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్రకు కేటీఆర్ ఆదేశం... పట్నం వాంగ్మూలం?

Advertiesment
patnam narender reddy

ఠాగూర్

, శుక్రవారం, 15 నవంబరు 2024 (09:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా చేయాలంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారని, అందుకే జిల్లా కలెక్టరుపై దాడి చేసినట్టు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనట్టు సమాచారం. 
 
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ దాడి ఘటనపై ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర గురించి ఆయన చెప్పినట్లు అందులో వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ప్రధాన నిందితుడు సురేశ్‌ను పురమాయించినట్లు పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి సెల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఈ ఫోన్ కాల్ డేటా రికార్డును విశ్లేషించేందుకు కోర్టు అనుమతిని కోరారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి దాడి జరిగిన రోజు వరకు సురేశ్‌కు, నరేందర్ రెడ్డికి మధ్య 84 ఫోన్ కాల్స్ సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో దాడి జరిగిన రోజు మాత్రం ఒకసారి మాట్లాడినట్లు గుర్తించారు.
 
లగచర్ల ఘటన కుట్ర వ్యూహరచనలో నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, అందుకు అవసరమైన ఆర్థిక వనరులతో పాటు నైతిక మద్దతు ఆయనే సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీని వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఉందని తెలిపారు. అందుకే పలు గ్రామాలకు చెందిన రైతులను సురేశ్ రెచ్చగొట్టారని, భూసేకరణకు వచ్చే అధికారులపై దాడులకు పురిగొల్పారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21 యేళ్ళకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి : సీఎం రేవంత్ రెడ్డి