ఉప్పల్ పోలీసుల పరిధిలో గురువారం 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థికంగా అతను నష్టపోయినట్లు తెలుస్తోంది. మృతుడు రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు చెందిన అరుణ్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక కళాశాలలో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. తరచుగా తన తల్లి బ్యాంకు ఖాతాను ఉపయోగించి బెట్టింగ్‌కు పాల్పడేవాడని.. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడని తెలుస్తోంది. గురువారం 10 గంటల ప్రాంతంలో అరుణ్‌ను అతని తల్లి ఒంటరిగా వదిలిపెట్టి పనికి వెళ్లింది. ఆపై ఆమె ఉదయం 11.30 గంటలకు తిరిగి వచ్చేసరికి అరుణ్ నేలపై విగతజీవిగా పడి వుండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభ కారణంగా అతను తీవ్ర చర్య తీసుకున్నాడని ప్రాథమికంగా తేలింది.
మరింత దర్యాప్తు జరుగుతోందని, డిజిటల్ బెట్టింగ్ ఆకర్షణ యువకుల ప్రాణాలను బలిగొంటున్నందున, వారి పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించాలని తల్లిదండ్రులను కోరారు.