గురువారం పూట గంటల్లో పెళ్లి జరగాల్సి వుండగా వరుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగల్‌పహాడ్ గ్రామంలో ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. 13వ తేదీన తల్లిదండ్రులు ఇతనికి వివాహం కుదిర్చారు.
పెళ్లి చేసుకుని ఎంతో అందమైన జీవితాన్ని గడపాల్సిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒక రోజు ముందు ఆ యువకుడు ఇలా ఆత్మహత్మ చేసుకోవడానికి ముఖ్య కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివిధ కోణాల్లో వరుడి ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.