Publish Date: Mon, 10 Aug 2026 (15:45 IST)
Updated Date: Mon, 10 Aug 2026 (15:48 IST)
Car Catches Fire in Hayathnagar
హైదరాబాద్, హయత్‌నగర్‌లోని శంకర్ నగర్ కాలనీలో సోమవారం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సమయంలో పెద్ద శబ్దం రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.
చాలా కాలంగా వాడకపోవడంతో ఆ కారును పక్కన పెట్టి ఉంచినట్లు యజమాని తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు అంటుకున్నప్పుడు బాంబు పేలుడు తరహాలో పెద్ద శబ్దం వచ్చిందని, అసలు ఏం జరుగుతుందో తెలియక తాము భయపడ్డామని స్థానికులు చెప్పారు.
ఈ ఘటనలో శంకర్‌నగర్ మాధవ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ కారు పూర్తిగా మంటలకు ఆహుతి అయ్యింది. కారును ఎవరో ఆకతాయిలు కావాలనే తగలబెట్టి ఉంటారని కారు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు దగ్ధమైన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More