Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

Advertiesment
Biryani

సెల్వి

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:51 IST)
రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే.. ఇంకా కొంచెం తినాలనిపిస్తుందని అంటారు ఆహార ప్రియులు. అయితే బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వుండాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్ ఆహారంలో బిర్యానీ రకాల్లో బొద్దింకలు, జెర్రిలు కనిపించిన సంఘటనలు వున్నాయి. 
 
తాజాగా నగరంలోని వినాయక్‌ నగర్‌లోని  ఓ హోటల్‌లో పన్నీర్ బిర్యానీ పార్శిల్ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీలో పన్నీర్‌తో పాటు చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. 
 
పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం ఏంటని ఆశ్చర్యానికి గురై శ్రద్ధగా గమనిస్తే అవి చికెన్ ముక్కలేనని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన