Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

Advertiesment
revanth reddy

ఠాగూర్

, సోమవారం, 1 డిశెంబరు 2025 (10:16 IST)
ముఖ్యమంత్రి రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'ను నిర్వహించతలపెట్టింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది. డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు.
 
ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఒక ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఈ కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన 4,500 మందికి ఆహ్వానాలు పంపగా, 1,000 మంది తమ రాకను ధ్రువీకరించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
 
ఈ సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. గడిచిన అనుభవాలను పాఠాలుగా తీసుకుని, భవిష్యత్ తరాల కోసం ఈ దార్శనిక పత్రాన్ని సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ వంటి సంస్థల సహకారంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు.
 
రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాదు కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 'కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ'ని ప్రోత్సహించనుంది. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు బయట ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు పరిధిని 'పెరి అర్బన్ రీజియన్ ఎకనామిక్' జోన్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో దిత్వా తుఫాను విధ్వంసం 334 మంది మృతి, 370మంది గల్లంతు