Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

Advertiesment
walk on fire

ఠాగూర్

, మంగళవారం, 8 జులై 2025 (09:45 IST)
అగ్రరాజ్యం అమెరికాలోని గ్రీన్ కౌంటీ వద్ద జరిగిన ఘోరో రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల అమెరికాలోని తమ బంధువులను చూసేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరి పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
 
హైదరాబాద్‌కు చెందిన వెంకట్, తేజస్విని దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవలే విహారయాత్ర కోసం అమెరికా వెళ్లారు. డాలస్ నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి డాలస్‌కు కారులో తిరిగి వస్తుండగా గ్రీన్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
 
వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఒక మినీ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టడంతో, వెంకట్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో నలుగురూ కారులోనే సజీవదహనమై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి బంధువులు, హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)