Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

KCR: ఆయనెందుకు రావాలి.. ఎన్టీఆర్, జయలలిత అలా చేయలేదా?: కేటీఆర్

Advertiesment
ktramarao

సెల్వి

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:20 IST)
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎక్కువగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. గత ఏడాది కాలంలో కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు.
 
 ఈ అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. కేసీఆర్ వచ్చే నాలుగేళ్ల పాటు సభకు హాజరుకావడం లేదనే విషయం నిజమేనన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడానికి గల కారణాన్ని అడిగినప్పుడు, కేటీఆర్ ఇతర ఉదాహరణలను తెరపైకి తెచ్చారు.
 
సీనియర్ ఎన్టీఆర్, జయలలిత, ఇతర మాజీ సీఎంలు కూడా చాలా కాలం పాటు అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, అయితే మళ్లీ ప్రజాతీర్పుతో గెలిచి ఇంటి సీఎంలుగా అడుగుపెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
 
తాను, తమ పార్టీ నేతలు కూడా అసెంబ్లీకి రాకుండా ఉండమని కేసీఆర్‌కి సలహా ఇస్తున్నారని కేటీఆర్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. "అవును ఆయనను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నాం. ఆయన అసెంబ్లీకి ఎందుకు రావాలి? వారి (కాంగ్రెస్‌) ఇదేం దిక్కుమాలిన శాడిజంతో అవమానించడమా?" అంటూ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష నేతను ఎలా అవమానిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై కుర్లాలో బస్సు బీభత్సం - ఆరుగురు మృతి - 49 మందికి గాయాలు