Publish Date: Mon, 02 Mar 2026 (22:31 IST)
Updated Date: Mon, 02 Mar 2026 (22:33 IST)
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ విద్యార్థినిపై లైంగికంగా దాడికి పాల్పడటమే కాకుండా మాట వినకుంటే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని ఆమెను బెదిరించాడు.
అతడి వేధింపులు తాళలేక సదరు యువతి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో విషయం తెలసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాది కాలంగా ఏఎన్సీ అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా వరుసగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.
సెల్వి
Publish Date: Mon, 02 Mar 2026 (22:31 IST)
Updated Date: Mon, 02 Mar 2026 (22:33 IST)