Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ నగర ప్రయాణికులకు శుభవార్త - మెట్రో - ఆర్టీసీ బస్సుల కోసం కామన్ పాస్

Advertiesment
Metro
హైదరాబాద్ నగర ప్రయాణికులకు శుభవార్త. నగరంలో తిరిగే మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకునిరావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నెలవారీ, రోజువారీ పాస్‌లను కూడా జారీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. 
 
ఆదివారం రసూలురాలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్ఎంఆర్ఎల్, ఆర్టీసీ, విద్యుత్, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాస్ జారీకి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎస్‌కు వివరించారు. హైదరాబాద్ మెట్రో మొదటి, రెండో దశల్లో చేపట్టిన పనుల పురోగతిని మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ సీఎస్‌కు తెలియజేశారు.
 
ఈ సమావేశం అనంతరం సీఎస్ నగరంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణించి, స్టేషన్లలోని వాణిజ్య సముదాయాలు, పార్కింగ్ వసతులను పరిశీలించారు. హైదరాబాద్ పాతబస్తీలో 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, వాటిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబులెన్స్‌లోనే ప్రసవించిన మహిళ..