Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలాపూర్‌లో దారుణ ఘటన: మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి

Advertiesment
drugs

సెల్వి

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (15:57 IST)
హైదారాబాద్, బాలాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
అయితే సాహిల్ అనే వ్యక్తి ఈ విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. ఒకేసారి ఇంజెక్షన్‌తో పాటు టాబ్లెట్లు తీసుకున్న నసర్ సహా మరో ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ముగ్గురికి మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్ అనే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్‌ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా