Publish Date: Thu, 06 Aug 2026 (19:49 IST)
Updated Date: Thu, 06 Aug 2026 (20:14 IST)
ప్రేమకు సంబంధించిన మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యంతో చేతిలో స్మార్ట్ ఫోన్లు చేతిలో వుండటం ద్వారా సులభంగా పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిచయాలు కాస్త ప్రేమగా, ఆపై మోసాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని, ఓ యువతి అతని ఇంటి ముందు నిరసన తెలిపింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
లింగంపల్లిలోని ఓ క్లినిక్‌లో పరిచయమైన శ్రవణ్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని అరుణ అనే యువతి ఆరోపించింది. ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భిణీనని బాధితురాలు తెలిపింది. పటాన్‌చెరులోని శ్రవణ్ ఇంటి ముందు బాధితురాలు నిరసన చేపట్టి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More