Publish Date: Thu, 05 Nov 2026 (11:38 IST)
Updated Date: Thu, 05 Nov 2026 (11:45 IST)
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో గల్లంతైన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు సిబ్బంది ఆచూకీ లభించగా, వారిని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఒక స్థానిక వ్యక్తి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న రెస్క్యూ బోట్లు బోల్తా పడటంతో, వారంతా వరద నీటిలో కొట్టుకుపోయారు.
బుధవారం రాత్రి 3 గంటల సమయానికి ఐదుగురు సిబ్బంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. అయితే, వారు కూడా సురక్షితంగానే ఉన్నారని గురువారం ఉదయం అధికారులు ధృవీకరించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More