Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

Advertiesment
kavitha

ఠాగూర్

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (14:17 IST)
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లను లక్ష్యంగా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్ 
 
తన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా తన ఎక్స్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
"చనలచిత్ర రంగంలో అగ్రనటుడుగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాషుష్మాన్ భవ పవన్ కళ్యాణ్" అంటూ పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు ఆ వ్యక్తిని కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు