Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Advertiesment
ktrbrs

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (14:44 IST)
గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ కోసం నిధుల మళ్లింపు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌గా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భయపడటం లేదని కేటీఆర్ చెప్పారు. ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు. లీగల్‌గా తాము ముందుకెళతామన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదన్నారు.
 
ఈ-కార్ రేసింగ్‌లో అవినీతి జరగలేదని, ప్రొసీజర్ సరిగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గురువారం చెప్పారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు సమాచార లోపం ఉందని చెప్పారు. 
 
ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్‌తో విచారణ జరిపిస్తే... అందులో ఉండే అధికారులు ప్రభుత్వం మాట వింటారని చెప్పారు. రేవంత్ కింద పని చేసే అధికారులతో న్యాయం జరగదని వారు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు