Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Advertiesment
Army

ఐవీఆర్

, మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (23:20 IST)
Pahalgam Terrorist Attack జమ్ముకాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ఉగ్రవాద దాడిలో తెలంగాణకు చెందిన మనీష్ రంజన్(Manish Ranjan) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మనీష్ రంజన్ ఇంటలిజెన్స్ బ్యూరో(IB)లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు పర్యటనకు వచ్చిన ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సురక్షితంగా వున్నట్లు అధికారులు తెలియజేసారు.
 
కాన్పూర్ వ్యాపారవేత్త మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో కాన్పూర్‌కు చెందిన సిమెంట్ వ్యాపారి శుభం ద్వివేది (31) కాల్చి చంపబడ్డాడు. అతడికి ఇటీవల ఫిబ్రవరిలో వివాహం అయింది. అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ సందర్శించడానికి వెళ్ళారు. ఈ ప్రయాణం వారి వైవాహిక జీవితంలో పెను విషాదాన్ని మిగిల్చింది.
 
సంఘటన జరిగిన సమయంలో శుభం భార్య కూడా సంఘటనా స్థలంలోనే ఉంది. ఉగ్రవాదులు మొదట శుభమ్ పేరు అడిగారు, ఆ తర్వాత అతని తలపై కాల్చి చంపారని ఆమె ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పారు. బుల్లెట్ గాయం కారణంగా శుభం అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద సంఘటన తర్వాత కుటుంబం, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
 
ఈ వార్త శుభం గ్రామం కాన్పూర్‌లోని హాతిపూర్‌కు చేరుకోగానే, ఆ ప్రాంతమంతా శోకసంద్రం అలుముకుంది. గ్రామ ప్రజలు అతని ఇంటి వద్ద గుమిగూడి కుటుంబ సభ్యులను ఓదార్చడం ప్రారంభించారు. శుభం తండ్రి సంజయ్ ద్వివేది ఈ విచారకరమైన వార్తను తనకు చెప్పారని శుభం మామ మనోజ్ ద్వివేది తెలిపారు.
 
శుభం ద్వివేది తన వినయపూర్వకమైన స్వభావం, కృషి కారణంగా ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతదేహాన్ని కాన్పూర్‌కు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించించారు. పోలీసులు, భద్రతా సంస్థలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సంఘటన కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి