Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

Advertiesment
Krystyna Pyszkova

సెల్వి

, మంగళవారం, 18 మార్చి 2025 (19:37 IST)
Krystyna Pyszkova
తెలంగాణ మే 7 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అందాల రాశులను ఈ వేడుకలో పాల్గొనేవారిని స్వాగతిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. 
 
"యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఆనందం, ఆత్మ శాంతిని కలిగించింది. తెలంగాణలో దాగివున్న ఇలాంటి మేటి రత్నాలను మరిన్ని చూడటానికి నేను వేచి ఉండలేను" అని పిస్జ్కోవా అన్నారు. 
 
యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకోవడం నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంత వాతావరణం నన్ను ఎంతో ఆకర్షించాయి" అని క్రిస్టినా పిస్జ్కోవా పేర్కొన్నారు.  
Krystyna Pyszkova
Krystyna Pyszkova
 
త్వరలోనే 120 మంది మిస్ వరల్డ్ స్పర్థాకులు కూడా ఈ దివ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. వారు కూడా ఇక్కడి వైభవాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!