Publish Date: Thu, 23 Jul 2026 (08:49 IST)
Updated Date: Thu, 23 Jul 2026 (08:54 IST)
సెల్‌ఫోన్లతో ఇబ్బందులు తప్పవనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా సెల్ ఫోన్ పేలిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానెపల్లి మండలం గుడెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు, బుధవారం ఉదయం తన సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో దవడకు తీవ్ర గాయాలై మరణించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న తన కుమారుడు సెల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడ్డాడని మృతుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాయపడిన కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మరణించాడు. ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ బ్యాటరీతో తన కుమారుడు ఏదో చేస్తుండగా అది పేలిందని తండ్రి పోలీసులకు తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More