Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీసు బదిలీ

Advertiesment
traffic signal

సెల్వి

, గురువారం, 18 జులై 2024 (19:40 IST)
లారీ డ్రైవర్‌పై అభ్యంతరకంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీసు అధికారిని తెలంగాణ పోలీసులు గురువారం బదిలీ చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీసు అధికారిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆ వీడియోను పోస్ట్‌ చేసి, పోలీసుల తీరు మార్చేందుకు సెన్సిటైజేషన్‌ తరగతులు నిర్వహించాలని తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను కోరారు.
 
ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసు అధికారి ఒక ట్రక్ డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపించిందని.. దుర్భాషలాడుతూ వినిపించిందని కేటీఆర్ డీజీపీని ప్రశ్నించారు. సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, ఆ తర్వాత ఆ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్లామని, 24/7 ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్‌ యాజమాన్యానికి షాక్.. వారం రోజుల మూసివేతకు ఆదేశం!!