Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

Advertiesment
upsc exam

ఠాగూర్

, గురువారం, 24 ఏప్రియల్ 2025 (09:14 IST)
జీవితంలో ఏదైనా సాధించాలన్న అకుంఠిత దీక్ష ఉంటే, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని, నమ్మకం ఉంటే అనుకున్నది సాధించేవరకు పట్టువిడవకూడదని తెలుగు తేజం సాయి చైతన్య నిరూపించాడు. సివిల్స్ పోటీ పరీక్షల్లో ఐదుసార్లు విఫలమైనప్పటికీ ఆరోసారి ప్రయత్నంలో విజయం సాధించాడు. ఫలితంగా జాతీయ స్థాయిలో 68వ ర్యాంకును సాధించాడు. 
 
జీవితంలో ఎంతో ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకున్న ఎంతో మంది మధ్యలోనే నిరుత్సాహంతో వారి ప్రయాణాన్ని ఆపేస్తుంటారు. అతి తక్కువ మంది మాత్రమే నిరుత్సాహానికి గురికాకుండా వారి లక్ష్యంగా ప్రయాణాన్ని ఆపేస్తుంటారు. అతి తక్కువ మంది మాత్రమే నిరుత్సాహానికి గురికాకుండా వారి లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి విజేతల్లో ఒకరు సాయి చైతన్య. సివిల్ సర్వీసెస్‌లో చైతన్య చివరకు అద్భుతమైన ఫలితాన్ని సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. సివిల్స్ ఫలితాల్లో ఆయన 68వ ర్యాంకును సాధించాడు. 
 
దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న చైతన్య కృషి ఆషామాషీ కాదు. ఐదుసార్లు ఆయన సివిల్స్ పరీక్షల్లో నిరాశను ఎదుర్కొన్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా, డీలా పడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు ఆరో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 68వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!