Publish Date: Wed, 05 Aug 2026 (14:18 IST)
Updated Date: Wed, 05 Aug 2026 (14:22 IST)
చిన్నారులు ఇంట్లో వుంటే ఎంతో జాగ్రత్తగా వుండాలి. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలే నిదర్శనం. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో, ఒక భవనం రెండో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
మృతురాలిని దీక్షితగా గుర్తించారు. భవనం పైనుంచి కిందపడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
Read More