Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీన్ రివర్స్.. టీవీ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన త్రిష.. ఎవరు?

Advertiesment
crime

సెల్వి

, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (22:08 IST)
పెళ్లిచేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఓ టీవీ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. యాంకర్ ప్రణవ్ ప్రముఖ టీవీ ఛానెల్‌లో పనిచేస్తుండగా, నిందితురాలు త్రిష డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇంకా అనేక స్టార్టప్‌లను కలిగి ఉంది.
 
మ్యాట్రిమోనియల్ సైట్‌లో ప్రణవ్ ఫోటోలు చూసిన త్రిష అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. మ్యాట్రిమోనియల్ సైట్‌లో లభించిన వివరాల ఆధారంగా ఆమె పెళ్లి ప్రపోజ్ చేసినప్పుడు, ప్రణవ్ ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. అంతటితో ఆగని త్రిష.. ప్రణవ్ ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ రచించింది.
 
ఈ నెల 10వ తేదీన త్రిష పక్కా ప్లాన్ ప్రకారం ప్రణవ్‌ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి సహచరుల సాయంతో ప్రణవ్‌ను గదిలో బంధించింది. అయితే, ప్రణవ్ తప్పించుకోగలిగాడు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కథలో ట్విస్ట్ ఏమిటంటే, మ్యాట్రిమోనియల్ సైట్‌లో త్రిష చూసిన ప్రణవ్ ప్రొఫైల్ నకిలీదని, చైతన్య రెడ్డి అనే యువకుడు త్రిషతో సంభాషణలు చేయడానికి ప్రణవ్ ఫోటోలు, వివరాలను ఉపయోగించి సృష్టించాడు. ఇది ప్రణవ్ రియల్ ప్రొఫైల్ అని నమ్మిన త్రిష పెళ్లి కోసం అతన్ని కిడ్నాప్ చేసే స్థాయికి వెళ్లింది.
 
ఈ ఘటనపై యాంకర్ ప్రణవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు మాత్రమే నిజమని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తానని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో పూర్తి మహిళా శాఖను ప్రారంభించిన పిరమల్ ఫైనాన్స్