Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్ కాదు రీల్.. రీల్స్ చేస్తూ రైలు నుంచి దూకేసింది.. అత్యాచారం జరగలేదు.. (video)

Advertiesment
MMTS

సెల్వి

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (15:33 IST)
MMTS
మార్చి నెలలో అనంతపురం అమ్మాయికి రైలులో జరిగిన ఘటన సంచలనం. ప్రజా రవాణా వాహనాల్లో మహిళలకు భద్రత లేకపోవడంపై మహిళా సంఘాలు కూడా నిరసన తెలిపాయి. కదిలే రైలులో నిందితుడి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఎంఎంటీఎస్ నుండి దూకేసింది. అంతే ఆమె ధైర్యాన్ని చాలామంది మెచ్చుకున్నారు. 
 
అయితే ఈ ఘటన అంతా రీలేనని రియల్ కాదని తేలిపోయింది. 23 ఏళ్ల ఆ యువతి మేడ్చల్ సమీపంలోని ఎంఎంటీఎస్ నుండి దూకి గాయపడింది. ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ అనంతపురం అమ్మాయి చెప్పిందల్లా అబద్ధం.
 
ఆమె కథలో, మేడ్చల్ సమీపంలోని మహిళల కంపార్ట్‌మెంట్‌లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు 25 ఏళ్ల యువకుడు ఆమెపై బలవంతంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి తాను ఎంఎంటీఎస్‌పై నుండి దూకినట్లు ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్‌లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో పనిచేసే అమ్మాయి అందరినీ పిచ్చోళ్లను చేసిందని పోలీసులు కనుగొన్నారు. 
 
నిజానికి, ఆమె ఇన్‌స్టా రీల్ కోసం ఎంఎంటీఎస్‌ నుండి దూకింది. అవును, మీరు చదివింది నిజమే. సీసీటీవీ ఫుటేజ్‌లను విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాత, ఆ వివరణకు సరిపోయే వ్యక్తి ఎవరూ పోలీసులకు దొరకకపోవడంతో ఆమె అదే విషయాన్ని ఒప్పుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య