Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బర్త్ డే రోజు ఫ్రెండ్స్‌తో కలిసి మందేసిన యువతి.. మత్తులో ముగ్గురు కలిసి....

Advertiesment
young woman
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (11:45 IST)
తన పుట్టినరోజు కాస్త ఆ అమ్మాయి జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చింది. మరుపరాని రోజుగా గుర్తుపెట్టుకునేందుకు ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ కాస్తా బెడిసికొట్టి తన జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణమైంది. అది కూడా తన ప్రాణస్నేహితుల వల్ల కావడంతో ఆమె తేరుకోలేకి స్థితిలోకి వెళ్ళిపోయింది.
 
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న అరోరా.. అరుణ్, ఆదిత్యలు మంచి స్నేహితులు. పక్కపక్కనే ఇంట్లో ఉండడంతో చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. దీంతో అరోరా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. ఖాళీ సమయం దొరికితే తన ఇద్దరు స్నేహితులతో తిరుగుతూ ఉండేది. అయితే అరుణ్, ఆదిత్యలకు తెలియకుండా అరోరా, వరుణ్ అనే యువకుడ్ని ప్రేమించింది. గత ఆరునెలల నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. 
 
అయితే ఆదిత్య కూడా అరోరాను ప్రేమించాడు. ఆమె పుట్టినరోజు కావడంతో అరుణ్, ఆదిత్యలు ఇద్దరూ కలిసి ఆమెకు ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. ఆదిత్య మాత్రం తన మనస్సులోని ప్రేమను అరోరాకు చెప్పేయాలనుకుని నిర్ణయించుకున్నాడు. బర్త్ డే రోజు అరోరాకు బలవంతంగా మద్యం తాగించారు. 
 
పీకలదాకా ముగ్గురు మద్యం సేవించారు. దీంతో అరోరా స్పృహ తప్పి పడిపోయింది. అరుణ్ మద్యం మత్తులో ఆమెను బలవంతం చేసే ప్రయత్నం చేశాడు. ఆదిత్య అతన్ని అడ్డుకున్నాడు. అరుణ్, ఆదిత్యను దారుణంగా కొట్టి చంపేశాడు. పుట్టినరోజు తన స్నేహితులతో కలిసి ఉంటానని, ఇక్కడకు వస్తే స్నేహితులకు పరిచయం చేస్తానని చెప్పింది అరోరా.
 
దీంతో  అరుణ్ గదికి వచ్చాడు. అరోరాను బలవంతం చేసేందుకు అరుణ్ ప్రయత్నిస్తుండగా వెంటనే అడ్డుకున్నాడు వరుణ్. దీంతో అతన్ని కూడా చంపేశాడు అరుణ్. అరోరాపై అత్యాచారం చేసి ఆ తరువాత ఇంటి దగ్గర వదిలేశాడు. 
 
ఉదయం లేచిన అరోరాకు పోలీసుల నుంచి ఫోన్. రాత్రి ఎక్కడ ఉన్నావంటూ ఎస్ఐ అడిగాడు. జరిగిందంతా చెప్పింది అరోరా. రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించింది మాత్రమే గుర్తు ఉందని.. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదని చెప్పడంతో పాటు తన స్నేహితుడు అరుణ్ కనిపించలేదన్న విషయాన్ని పోలీసులకు తెలిపింది. పరారీలో ఉన్న అరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళయి నెలరోజులే.. టిక్ టాక్ మోజులో పడి భర్తను వదిలి ప్రియుడితో జంప్..