Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
దేశంలో గత 24 గంటల్లో 23,068 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం కొత్తగా 24,661 మంది కోలుకున్నారు.
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,46,846కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 336 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దీంతో మృతుల సంఖ్య 1,47,092కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 97,17,834 మంది కోలుకున్నారు. 2,81,919 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.