రెడ్డా.. మజాకా : ములాఖత్‌లతో సెటిల్‌మెంట్లు చేస్తున్న మాజీ ఏఎస్ఐ
అక్రమదందాకు కేరాఫ్ అడ్రస్ మోహన్ రెడ్డి. సస్పెన్షన్‌కు గురైన ఏఎస్ఐ. కేవలం ఏడేళ్ళ సర్వీసులోనే కోట్లాది రూపాయల అక్రమాస్తులకు పడగలెత్తారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో అరెస
Publish Date: Fri, 17 Nov 2017 (11:31 IST)
Updated Date: Fri, 17 Nov 2017 (11:39 IST)
అక్రమదందాకు కేరాఫ్ అడ్రస్ మోహన్ రెడ్డి. సస్పెన్షన్‌కు గురైన ఏఎస్ఐ. కేవలం ఏడేళ్ళ సర్వీసులోనే కోట్లాది రూపాయల అక్రమాస్తులకు పడగలెత్తారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టై కరీంనగర్ జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అదీ కూడా దర్జాగా.. రాజభోగాలు అనుభవిస్తూ శిక్షను అనుభవిస్తున్నాడు.
అంతేనా, దందాలను జైల్లోనూ అలాగే కొనసాగిస్తున్నాడు. ములాఖత్‌లలోనే సెటిల్మెంట్లు చేస్తున్నాడు. జైల్లో ఉన్న ఖైదీలను నేరుగా కలిసేందుకు సాధారణంగా ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు. కానీ.. మోహన్ రెడ్డిని మాత్రం జైలు సూపరింటెండెంట్ గదిలో కూర్చోబెట్టి ములాఖత్‌లు జరిపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆఫీసులో తన కుటుంబసభ్యులతో ములాఖత్ అయ్యాడు మోహన్ రెడ్డి. వారితో చాలాసేపు మాట్లాడాడు. సెటిల్మెంట్లు, వ్యాపారాలపై ముచ్చటించాడు. మోహన్ రెడ్డి దర్జాలను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియో బయటకు రావడంతో… మోహన్ రెడ్డి రాజభోగాలే కాదు.. జైలు అధికారుల నిర్లక్ష్యం కూడా బయటపడింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More