పాముకుంటలో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు.
Publish Date: Fri, 22 Dec 2017 (08:59 IST)
Updated Date: Fri, 22 Dec 2017 (09:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు. వీరంతా కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వీరు విగత జీవులుగా పడిఉన్నారు. మృతులను బచ్చలి బాలనర్సయ్య (65), భారతమ్మ (58), దంపతులు బాలరాజు (44), నిర్మల (39) సహా ఇద్దరు కుమారులు చింటూ (12), బన్ని (8), కుమార్తె శ్రావణి (14)లుగా గుర్తించారు.
జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన వీరంతా నెల రోజుల క్రితం కోళ్లఫారంలోనే పనికి కుదిరారు. రాత్రి భుజించిన చికెన్ విషతుల్యం కావడం వల్లే మరణించివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
Read More